»Madhya Pradesh 5 Year Old Boy Dies After Falling Into 200 Feet Borewell
Borewell 200 అడుగుల బోరుబావిలో పడ్డ బాలుడు.. 10 గంటల శ్రమ వృథా
మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చిన్నారిని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలతో లేడు. ‘బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాం. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించినా బాలుడిని కాపాడుకోలేకపోయాం
ఇష్టారాజ్యంగా బోర్లు తవ్వడం వదిలేయడం. వదిలేసిన బోర్లపై మూతలు బిగించకపోవడంతో అభంశుభం తెలియని చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోతున్నారు. వందల అడుగుల లోతుల్లో ఉన్న బోరు బావుల్లో పడిన చిన్నారులకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అలా పడిన పిల్లలను వెలికి తీయడం చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత కష్టపడి వెలికితీసినా అప్పటికే చిన్నారి కన్నుమూసిన సంఘటనలు చాలా చూశాం. అయినా కొందరు మేలుకోవడం లేదు. తాజాగా ఇలాంటి సంఘటన మరోటి జరిగింది. 200 అడుగుల లోతులోని బోరుబావిలోకి చిన్నారి పడి మృతి చెందాడు. బాలుడిని కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
ఆ రాష్ట్రంలోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్డి గ్రామానికి బుర్హాపూర్ జిల్లా నుంచి వలస వచ్చిన కుటుంబం నివసిస్తోంది. చెరుకు కోత వృత్తిలో ఈ కుటుంబం ఉంది. ఎప్పటిలాగే తమ ఐదేళ్ల పిల్లాడు సాగర్ బుధ బరేలాని తీసుకుని సోమవారం చెరుకు కోసేందుకు వెళ్లారు. వారు పనులు చేస్తుండగా ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి కనిపించకుండాపోయాడు. కొద్దిసేపటికి ఈ విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు స్థానికంగా మొత్తం వెతికారు. అనంతరం బోరు బావిలో పరిశీలించగా బాలుడు కనిపించడంతో హతాశయులయ్యారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ 5వ బెటాలియన్ చేరుకుంది.
తక్షణమే చిన్నారిని బయటకు తీసే పనులు మొదలుపెట్టారు. జాతీయ విపత్తు దళం (National Disaster Response Force (NDRF) నిర్విరామంగా పనులు చేపట్టినా అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. బోరుబావిలో ఊపిరాడక చిన్నారి మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు చిన్నారిని బయటకు తీశారు. కానీ అప్పటికే బాలుడు ప్రాణాలతో లేడు. ‘బాలుడిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాం. ఉన్న అన్ని అవకాశాలను వినియోగించినా బాలుడిని కాపాడుకోలేకపోయాం’ అని ఎన్డీఆర్ఎఫ్ అధికారి పవన్ గౌర్ తెలిపారు.