IPL:తడబడ్డ సన్ రైజర్స్.. 8 వికెట్లు కోల్పోయి..121 రన్స్
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచారు.
IPL:రెండో మ్యాచ్‌లోనూ సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ (SRH) తడబడ్డారు. ఒకరి వెనక మరొకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రాహుల్ త్రిపాఠి (Rahul tripati) ఒక్కడే రాణించాడు. అతను 34 పరుగులు చేయడంతో స్కోరు మూడంకెలు దాటింది. సింగ్ (singh) 31 పరుగులు, సమద్ (samad) 21 రన్స్ మాత్రమే చేశారు. తిరిగి జట్టుతో చేరిన కెప్టెన్ మార్కం డకౌట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ టీమ్ 8 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో సూపర్ జెయింట్ ముందు 122 పరుగుల లక్ష్యం ఉంచింది.
టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ మార్కం బ్యాటింగ్ తీసుకున్నాడు. కానీ బ్యాట్స్ మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కృనాల్ పాండ్యా 3 కీలక వికెట్లు తీసి సన్ రైజర్స్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీశాడు. ఠాకూర్, రవి తలో వికెట్ చొప్పున తీశారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో లక్నో జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. లైవ్ విన్ ప్రొబబిలిటీ ప్రకారం లక్నో జట్టుకు 81 శాతం విజయ అవకాశాలు ఉండగా.. సన్ రైజర్స్‌కు కేవలం 19 శాతం మాత్రమే ఛాన్స్ ఉంది.