»Lorry Accident In Hyderabad Vijayawada Highway At Narketpally Heavy Traffic Jam
Breaking లారీ బీభత్సం.. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ (Hyderabad-Vijayawada HighWay) జాతీయ రహదారిపై ఓ లారీ (Lorry) ప్రమాదానికి గురైంది. టైర్ పగిలి రోడ్డుపై అదుపు తప్పింది. ఈ లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా (Nalgonda District) నార్కట్ పల్లిలో (Narketpally) చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపైన భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించేలా చర్యలు తీసుకున్నారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.