»Looking For Dishwasher Customer Care Number Loses Rs 8 24 Lakh To Cyber Thugs
cyber fraud: కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతుకుతుంటే… రూ.8.24 లక్షలు చోరీ
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు.
నోయిడా (Noida)కు చెందిన సీనియర్ సిటిజన్ కపుల్ (senior citizen couple) ఇంటర్నెట్ లో ఓ డిష్ వాషర్ కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ (customer care number) కోసం వెతుకుతుండగా సైబర్ నేరగాళ్లు (Cyber crime) 8 లక్షల రూపాయలకు పైగా కొట్టేశారు. ఈ మేరకు గురువారం నోయిడా పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగి కూడా నెల రోజులు అవుతోంది. నోయిడా సెక్టార్ (Noida Sector) 133లోని తమ ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు ఈ సీనియర్ సిటిజన్ కపుల్. ఈ సైబర్ చోరీ ఘటన జనవరి 22, 23వ తేదీల్లో చోటు చేసుకున్నది. బాధితులు బుధవారం నాడు స్థానిక సెక్టార్ 126 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
వివరాలు ఇలా ఉన్నాయి… అమర్జీత్ సింగ్, రాజిందర్ అరోరా భార్యాభర్తలు. వీరు సీనియర్ సిటిజన్లు. జనవరి 21వ తేదీన వీరు గూగుల్ సెర్చింజన్ ద్వారా IFB డిష్ వాషర్ కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతికారు. ఆ సమయంలో వారికి 1800258821 నెంబర్ దొరికింది. ఈ నెంబర్ IFB కస్టమర్ కేర్ దిగా ఉన్నది. మరో షాకింగ్ ఏమంటే.. బంధన్ బ్యాంకుకు కూడా ఇదే కస్టమర్ కేర్ నెంబర్ చూపిస్తోంది. ఈ నెంబర్ చూసిన భార్య రాజిందర్ అరోరా పై నెంబర్ కు ఫోన్ చేశారు. లైన్ లోకి ఓ యువతి వచ్చింది. తాను IFB కస్టమర్ కేర్ గురించి ప్రశ్నించగా.. తాను సీనియర్ అధికారికి కనెక్ట్ చేస్తానని చెప్పారు.
లైన్ లోకి వచ్చిన సీనియర్ అధికారి తాను చెప్పినట్లు చేయాలని సూచించారు. మా ఫోన్ లో ఎనీ డెస్క్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, ఆ తర్వాత మీ లొకేషన్, యాప్ పైన వచ్చే ఫోర్ డిజిట్ కోడ్ వంటి వివరాలను ఇవ్వాలని కోరాడు. ఈ సేవలకు గాను రూ.10 ఫీజు రూపంలో చెల్లించాలని సదరు అధికారి సూచించాడు. మీ బ్యాంకు అకౌంట్ నుండి ఆ మొత్తం ట్రాన్సుఫర్ చేస్తే కంప్లయింట్ రిజిస్టర్ చేస్తామని తెలిపాడు. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న సమయంలో ఫోన్ పలుమార్లు కట్ అయింది. సదరు సీనియర్ అధికారి మరో ఫోన్ నెంబర్ నుండి పదేపదే ఫోన్ చేశాడు. ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పాడు. అయితే ఆ తర్వాత నుండి ఆ పర్సనల్ ఫోన్ నెంబర్ స్విచ్చాఫ్ వస్తుందని పోలీసులకు తెలిపారు దంపతులు.
ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు తమకు తమ బ్యాంకు నుండి మెసేజ్ వచ్చిందని, తమ జాయింట్ ఖాతా నుండి రూ.2.25 లక్షలు డెబిట్ అయినట్లు అందులో ఉందని పేర్కొన్నారు. మరుసటి రోజు ఉదయం మరో మెసేజ్ వచ్చింని, రో రూ.5.99 లక్షలు అకౌంట్ నుండి డెబిట్ అయినట్లుగా వచ్చిందని చెప్పారు. ఈ రెండు రోజుల్లో మొత్తం అక్షరాలా రూ.8.24 లక్షలు సైబర్ తెఫ్ట్ కు గురైనట్లు తెలిపారు. తాము సీనియర్ సిటిజన్లమని, బ్యాంకు సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల పైనే ఆధారపడి జీవిస్తున్నామని తెలిపారు.