రిషబ్ పంత్ లేకపోతే టీమిండియా బలం తగ్గిందని, అతను త్వరగా పూర్తిగా కోలుకొని రావాలని, ఆ తర్వాత ఆయనను చెంపదెబ్బ కొడతానని చెప్పాడు క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్(Kapil Dev).
కొద్ది రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన భారత క్రికెటర్ రిషబ్ పంత్ (rishabh pant) క్రమంగా కోలుకుంటున్నాడు. ఆపరేషన్ అనంతరం అతను పూర్తిగా కోలుకొని, తిరిగి మైదానంలో అడుగు పెట్టాలంటే కనీసం ఆరు నెలల నుండి ఏడాది పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ (rishabh pant) గురించి ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ (Kapil Dev) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత అతడిని చెంపలపై కొట్టాలని ఉందన్నాడు. ఓ చానల్ తో మాట్లాడిన కపిల్… పంత్ లేకపోవడంతో టీమిండియా బలం తగ్గిందన్నాడు. పంత్ పైన తనకు ఎంతో ప్రేమ ఉందని, అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత వెళ్లి చెంపలు వాయిస్తానని చెప్పాడు. ఇక నుండి మరింత జాగ్రత్తగా ఉండమని చెబుతానని, నువ్వు లేకపోవడంతో జట్టు బలం తగ్గిందని కూడా చెబుతానని అన్నాడు. అతడిని తాను ఎంతో అభిమానిస్తున్నానని చెప్పాడు. అదే సమయంలో కోపంగా కూడా ఉన్నానని, నేటి యువకులు ఎందుకు అలాంటి తప్పులు చేస్తున్నారని, వారికి చెంప దెబ్బలు పడాన్నాడు.
అతను త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా అందరూ కోరుకుంటున్నట్లు చెప్పాడు కపిల్ దేవ్ (Kapil Dev). దేవుడు అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు. అతను త్వరగా కోలుకొని, క్రికెట్ ఆడాలని అభిమానులు ఆశపడుతున్నారని చెప్పాడు. పిల్లలు తప్పు చేస్తే, చెంపదెబ్బ కొట్టే హక్కు తల్లిదండ్రులకు, అలా అభిమానించే వారికి ఉంటుందని చెప్పాడు. భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ (rishabh pant) డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. తొలుత డెహ్రాడూన్ లోని ఆసుపత్రిలో, ఆ తర్వాత ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ అతనికి రెండు ఆపరేషన్లు నిర్వహించారు.
40 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న పంత్ తన ఆరోగ్యం గురించి తాజా సమాచారం ఇచ్చాడు. బాల్కనీలో కూర్చున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇన్నాళ్లకు బయటకు వచ్చి స్వచ్చమైన గాలి పీల్చుకున్నట్లు తెలిపాడు. ‘ఇలా బయట కూర్చొని స్వచ్ఛమైన గాలి పీలుస్తుంటే ఇంత హాయిగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేద’ని పంత్ క్యాప్షన్ ఇచ్చాడు. ఆసుపత్రి భవనంలోనే పంత్ బయటకు వచ్చాడు. అతను త్వరగా కోలుకొని, ఫిట్ నెస్ సాధిస్తే ఈ ఏడాది చివరలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లో ఆడే అవకాశముంది.
పంత్ బెడ్ రెస్టులో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక టెస్టు సిరీస్, టోర్నీలకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఆస్ట్రేలియా సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్‌లకు పంత్ దూరంగా ఉంటాడు. వీటిని ఆసుపత్రి లేదా ఇంట్లో కూర్చొని చూడాల్సిందే. రిషబ్ పంత్ స్థానంలో ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లను బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేశారు.