Kanguva: యుద్ధ వీరుడు వస్తున్నాడు..షేక్ చేస్తున్న ‘కంగువా’ లుక్
ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌లోనే ఉన్నాయి. తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. కానీ తమిళ్ నుంచి మాత్రం తక్కువే. అందుకే ఆ లోటును పూడ్చేందుకు వస్తున్నాడు సూర్య. ఆ సినిమానే కంగువా.. తాజాగా ఈ సినిమా ప్రోమో రిలీజ్‌కు టైం ఫిక్స్ చేశారు. అందుకు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సూర్య కెరీర్లో 42వ ప్రాజెక్ట్‌గా వస్తున్న పాన్ ఇండియా సినిమాకు..ఇటీవలె ‘కంగువా(Kanguva)’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఏకంగా పది భాషల్లో ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహిస్తున్నాడు. దిశాపటానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్స్, టైటిల్ మోషన్ వీడియోలు..అంచనాలు భారీగా పెంచేశాయి. అంతేకాదు..ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కంగువా 2 కూడా రాబోతోందని ఫిక్స్ అయిపోయారు సూర్య ఫ్యాన్స్. రోజు రోజుకి అంచనాలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. ఇక ఇప్పుడు కంగువ ప్రోమో రిలీజ్‌కు రంగం సిద్దమైంది.
కంగువా ప్రోమో వీడియోని సూర్య బర్త్ డే కానుకగా, జులై 23న రిలీజ్ చేస్తున్నట్టుగా..ఓ సాలిడ్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో సూర్య యుద్ధవీరుడిలా ఖడ్గం చేతబట్టి..కదనరంగంలోకి కాలు దువ్వుతున్నట్టుగా ఉంది. కానీ సూర్య ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. చేతి నిండా టాటూస్‌తో టోన్డ్ షోల్డర్తో పర్ఫెక్ట్ వారియర్ లుక్‌లో ఉన్నాడు సూర్య. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న కంగువ సినిమాను..స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ కలిసి 2డీ, ౩డీ ఫార్మాట్లలో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను..2024లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి కంగువా ఎలా ఉంటుందో చూడాలి.