»Kamal Haasan Shows The Power Of A Farmer Next Movie
Kamal Haasan: రైతుగా మారుతున్న కమల్ హాసన్..!
విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) రైతుగా మారబోతున్నారు. కొంపదీసి సినిమాలు వదిలేసి, ఆయన వ్యవసాయం చేయాలని అనుకుంటన్నారా అని పొరపాటు పడకండి. తన కొత్త సినిమా కోసం ఆయన రైతు పాత్ర పోషించనున్నారు.
స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) తన కెరీర్లో బహుముఖ పాత్రలు పోషించడంలో ప్రసిద్ది చెందారు. లోకేష్ కనగరాజ్‌తో విక్రమ్‌తో యాక్షన్ ఎంటర్టైనర్తో సంచలనం సృష్టించారు. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు తన వచ్చే చిత్రంలో రైతుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో శరవేగంగా సాగుతున్న తన రాబోయే చిత్రం భారతీయుడు 2 షూటింగ్లో కమల్ బిజీగా ఉన్నాడు. బ్లాక్‌బస్టర్ చిత్రం ఇండియన్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రం తర్వాత కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలో రైతుగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమల్ హాసన్ తన తదుపరి చిత్రంలో హెచ్.వినోత్‌తో రైతు శక్తిని చూపించనున్నారు. హెచ్.వినోత్ అజిత్‌తో తునివు/తేగింపు దర్శకత్వం వహించారు. కమల్ హాసన్, హెచ్.వినోత్ రైతులతో చర్చలు జరుపుతుండటం విశేషం. సంప్రదాయ వరి సంరక్షణ కేంద్రం సభ్యులతో సమావేశమై తమ తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రణాళికలను రైతులతో పంచుకున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2023లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆగస్టు నాటికి కమల్ హాసన్ భారతీయుడు 2ని పూర్తి చేసుకుంటారు. ఇది కమల్ 233వ ప్రాజెక్ట్ కాగా, అతని తదుపరి 234 డైరెక్టర్ మణిరత్నంతో చేయనున్నారు.