»Jd Lakshminarayana Said Just Give Rupees 100 Per Month For Vizag Steel Plant
JD Lakshminarayana: వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం రూ.100 ఇవ్వండి..ప్లాంట్ మనకే!
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఏకమైతే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) పేర్కొన్నారు. ఈ క్రమంలో 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 విరాళంగా ఇస్తే రూ.850 కోట్లు సేకరించవచ్చని స్పష్టం చేశారు. అలా ఓ నాలుగు నెలల పంపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) మనకే సొంతం అవుతుందన్నారు.
ఏపీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్(Vizag Steel Plant) పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు ప్రజలందరిపై ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఈ క్రమంలో విశాఖ ప్రజల తరఫున తాను ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఆ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ సీజీఎం సత్యానంద్ కు బిడ్ దాఖలు పత్రాలను సమర్పించారు. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ పరిశ్రమ కోసం సరికొత్తగా విధానంలో నిధులు సేకరిస్తామని చెప్పారు. క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రన్స్ ఫర్ వంటి విధానాలు ఉపయోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని 8.5 కోట్ల మంది ప్రజలు నెలకు రూ.100 చొప్పున విరాళంగా అందజేస్తే 850 కోట్ల రూపాయలు జమ అవుతాయని జేడీ అన్నారు. అలా ఒక నాలుగు నెలలు ఇవ్వండి చాలు మన స్టీల్ ప్లాంట్ మనకే సొంతం అవుతుందని జేడీ స్పష్టం చేశారు.
అయితే విశాఖ ఉక్కు కర్మాగారం(Vizag Steel Plant) కోసం శనివారం మధ్యాహ్నంతో బిడ్ల దాఖలు గడువు పూర్తి కాగా..కార్మికుల ఆందోళనల నేపథ్యంలో బిడ్ల దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగించారు. మరోవైపు ఇప్పటివరకు సుమారు 22 బిడ్లు వచ్చినట్లు తెలిసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మికులు, మేధావులు, శరణార్థులు ఐక్యంగా వ్యతిరేకించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు సమైక్య ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్‌లో ప్రజల తరపున తాను పాల్గొంటానని చెప్పిన జేడీ ఎట్టకేలకు అదే చేశారు.
మరోవైపు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రం పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తోందని అన్నారు. ప్రభుత్వం మిశ్రమ సందేశాలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని కన్నా లక్ష్మీనారాయణ(Lakshminarayana) విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని, ప్రైవేటీకరణ బిడ్డింగ్‌లో ప్రభుత్వ భాగస్వామ్యం ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.