వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి విజయవాడ గుణదలలోని ఆయన నివాసంతో పాటు… పాలు చోట్ల దాడులు చేపడుతున్నారు. మొత్తం ఐదు టీమ్ లో ఈ సోదాల్లో పాల్గొనడం గమనార్హం. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంట్లో కూడా తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా… హైదరాబాద్ నగరంలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.ఐటీ అధికారులు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లల్లో సోదాలు చేపట్టారు.
జూబ్లీహిల్స్‌లో కాంట్రాక్టర్ జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి బామమరిది జనార్థన్ ఇంట్లో ఒక్కసారిగా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
వంశీ రామ్ బిల్డర్స్ కార్యాలయం, జనార్ధర్ రెడ్డి ఇళ్లతో పాటు మొత్తం 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలువురి వ్యాపారుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. తెలంగాణలో వరుస ఐటీ, ఈడీ సోదాలు సంచలనం రేపుతోన్నాయి.
అయితే… ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఈ రెండు ఐటీ రైడ్స్ కి కనెక్షన్ ఉన్నట్లు తెలుస్తోంది. వంశీరామ్ బిల్డర్స్పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.