»It Raids At Ycp Mla Mustafa Family Members Houses
it raids:వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ రైడ్స్
it raids:వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కనుమ ప్రస్తుతం అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను కనుమ చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో తీవ్ర కలకలం రేగుతోంది.
it raids:వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా (mustafa) కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహించారు. ముస్తఫా సోదరుడు కనుమ (kanuma) ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కనుమ ప్రస్తుతం అంజుమన్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే ముస్తఫా వ్యాపార లావాదేవీలను (business) కనుమ చూసుకుంటున్నారు. అధికార పార్టీ నేత ఇంట్లో ఐటీ సోదాలతో (it raids) తీవ్ర కలకలం రేగుతోంది.
2014, 2019 ఎన్నికల్లో గుంటూరు తూర్పు (guntur east) నియోజకవర్గం నుంచి ముస్తఫా వైసీపీ (ycp) నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ సారి ఎన్నికల్లో మాత్రం తాను నిలబడబోనని.. తన కూతురు పోటీ చేస్తుందని ముస్తఫా ప్రకటించారు. గతంలో సీఎం జగన్ (cm jagan) తమ నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ముస్తఫా తన కుమార్తెను పరిచయం చేశారు. రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయం నుంచి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా (fatima) రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. తండ్రితో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు.