»Indian Film The Elephant Whisperers Wins 95th Academy Award For Best Documentary Short Film Oscar 2023
Oscars Awards 2023: భారతీయ చిత్రం “ది ఎలిఫెంట్ విస్పరర్స్”కు ఆస్కార్ అవార్డు
కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.
95వ ఆస్కార్ అవార్డ్స్(Oscars Awards) 2023 వేడుకల్లో ఈసారి భారతీయ చిత్రాలు దుమ్మురేపుతున్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు చిత్రాలు నామినేషన్స్ కు వెళ్లాయి. వాటిలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో (RRR పాట “నాటు నాటు”), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ (షౌనక్ సేన్ ఆల్ దట్ బ్రీత్స్), ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ (కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్) నిలిచాయి.
వీటిలో కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ గా(Best Documentary Short Film) అకాడమీ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం హాలౌట్, హౌ డు యు మెజర్ ఏ ఇయర్, ది మార్తా మిచెల్ ఎఫెక్ట్, స్ట్రేంజర్ ఎట్ ది గేట్లకు వ్యతిరేకంగా పోటీ పడింది. కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves), గునీత్ మోంగా, అచిన్ జైన్(Guneet Monga and Achin Jain) ఆధ్వర్యంలో వచ్చిన ఈ చిత్రం డిసెంబర్ 2022లో నెట్ఫ్లిక్స్(netflix)లో విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఈ అవార్డును ‘నా మాతృభూమి భారతదేశంకి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
ముదుమలై నేషనల్ పార్క్లో 41 నిమిషాల నిడివితో ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్రాన్ని తెరకెక్కించారు. బొమ్మన్, బెల్లి అనే దేశీయ దంపతుల సంరక్షణలో రఘు అనే అనాథ ఏనుగు పిల్ల కథను చిత్రీకరించారు. ఏనుగుతో వారి మధ్య ఏర్పడే బంధాన్ని మాత్రమే కాకుండా వారి పరిసరాల సహజ సౌందర్యాన్ని కూడా ఈ చిత్రంలో చక్కగా చూపించారు. ఎలిఫెంట్ విస్పరర్స్ డిసెంబర్ 2022లో నెట్ఫ్లిక్స్(netflix)లో విడుదలైంది. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రత్యేకత ఏమిటంటే కార్తికి(Kartiki Gonsalves) ఇదే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడం విశేషం.