దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ.. ఫైనల్‌గా ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. 95 అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ విభాగంలో.. నాటు నాటు సాంగ్‌కు ఆవార్డ్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 80 పాటలు ఆస్కార్ రేసులో నిలవగా.. ఐదు పాటలు నామినేషన్స్ దక్కించుకున్నాయి. రేసులో ఉన్న లేడి గగా వంటి స్టార్‌ని సైతం వెనక్కి నెట్టి.. నాటు నాటు పాట ఆస్కార్ సొంతం చేసుకుంది. ప్రతి ఒక్క భారతీయుడు ఈ మూమెంట్‌ను చాలా ప్రౌడ్‌గా భావిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు మరో ఆస్కార్ కూడా ఇండియా సొంతం చేసుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ అనే డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డు దక్కించుకుంది. దాంతో ఈ డాక్యుమెంటరీ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్స్. అసలు ఆస్కార్ కొట్టేంత రేంజ్లో ఈ షార్ట్ ఫిల్మ్ ఉందా.. అని సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ గురించి కొన్ని ఇంట్నెస్టింగ్ విషయాలు మీకోసం. ఈ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు కార్తికి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించింది. ఓ మహిళా దర్శకురాలిగా కార్తికీ గోన్సాల్వేస్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. ఈమె భారతీయ సహజ చరిత్ర, సోషల్ డాక్యుమెంటరీ ఫోటో జర్నలిస్ట్. ఈ డాక్యుమెంటరీలో ఒక జంట, అనాథ ఏనుగుల మధ్య ఏర్పడే బంధాన్ని మనసుకు హత్తుకునేలా చూపించారు. రెండు ఏనుగు పిల్లలను పెంచిన ఓ వృద్ధ జంట కథే ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’. ముదుమలై పులుల అభయారణ్యంలో ఈ కథ నడుస్తుంది. దాదాపు నాలుగైదేళ్ళ పాటు పెంచిన ఏనుగు పిల్లను విడిచి పెట్టడానికి.. ఓ జంట ఎలాంటి మానసిక సంఘర్షణకు గురయ్యారో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఈ డాక్యుమెంటరీ గత ఏడ డిసెంబర్లో నెట్ ఫిక్స్లోకి అందుబాటులోకి వచ్చింది. దీనికోసం దాదాపు 5 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఏనుగులను దగ్గర నుంచి రీసెర్చ్ చేసేందుకు దాదాపుగా ఏడాదిన్నర సమయం తీసుకున్నారట. అందుకే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌కు ఎంపికైంది. వీలైతే మీరు కూడా ఓసారి చూసేయండి.