కరోనా మహమ్మారి (Covid-19) భారతదేశంలో (India) మళ్లీ విజృంభిస్తోంది. రోజువారి కేసులు (Daily Cases) సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా కేసులు గణనీయంగా పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ఒక్క రోజులోనే మూడు వేల కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Ministry of Health) రాష్ట్రాలకు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
తాజాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 3,016 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 40% పెరిగింది. 14 మరణాలు (Deaths) సంభవించాయి. దాదాపు ఆరు నెలల్లో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో కలిపి యాక్టివ్ కేసులు (Active Cases) 13,509కి పెరిగాయి. రోజువారీ పాజిటివిటీ రేటు (Positivity Rate) 2.7 శాతంగా నమోదైంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (Govt of Delhi) ఈరోజు అత్యవసరంగా సమావేశం కానుంది.
గత రెండు వేవ్ (Corona Wave)లో విజృంభణ సాగిన మహారాష్ట్రలోనే (Maharashtra) తాజాగా అధికంగా కేసులు నమోదవుతున్నాయి. ముంబై (Mumbai), పుణె (Pune), థానే (Thane), సంగ్లీ ప్రాంతాల్లో కేసులు అధికంగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం (Govt of Maharashtra) అప్రమత్తమైంది. వెంటనే నివారణ చర్యలు చేపట్టింది. ఇక కేరళలో (Kerala) కూడా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ప్రజలు మాస్కులు వినియోగించాలని.. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ వేసుకోనివారు వెంటనే వేసుకోవాలని చెబుతున్నారు.