SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు గురువారం తన క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల ఎమ్మార్వోలతో సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన పునరావాస, సహాయక చర్యలపై అధికారుల నుండి ఆయన సమగ్ర నివేదికను కోరారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలన్నారు.