MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 8వ తరగతి విద్యార్థులు గురువారం విద్యా క్షేత్ర పర్యటనలో భాగంగా శాంతిఖని గనిని సందర్శించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్ అబ్దుల్ ఖాదర్, గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా వర్యవేక్షణలో విద్యార్థులకు బొగ్గు తవ్వకాల ప్రక్రియ, యంత్రాల వినియోగం, గనుల నిర్మాణం, కార్మికుల భద్రతా చర్యల గురించి ప్రత్యక్షంగా వివరించారు.