ASR: తుఫాన్‌తో దేవీపట్నం మండలంలో 13 హెక్టర్లలో పంట నష్టం జరిగిందని అగ్రికల్చర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు గురువారం మీడియాకు తెలిపారు. 8 హెక్టర్లలో వరి, 6 హెక్టర్లలో మినుము పంట దెబ్బతిందన్నారు. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశామని తెలిపారు. మండలంలో 4549 ఎకరాల్లో వరి, 82 ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేస్తున్నారని వెల్లడించారు.