తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన సంఘటనపై తాజాగా స్మితా సభర్వాల్ ట్విటర్ వేదికగా స్పందించారు.
‘అర్ధరాత్రి బాధాకరమైన అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ధైర్యం, చాకచక్యంతో నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా మనల్ని మనం రక్షించుకోవాలి. రాత్రిళ్లు తలుపులు, తాళాలను పరిశీలించాలి. అత్యవసర పరిస్థితులో డయల్ 100కు ఫోన్ చేయాలి’ అని స్మితా సభర్వాల్ ట్వీట్ చేశారు.
అయితే స్మితా ఇంట్లోకి దూరిన వ్యక్తి వివరాలు తెలిశాయి. మేడ్చల్ జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి (45)గా గుర్తించారు. తన స్నేహితుడు దుర్గా విలాస్ హోటల్ యజమాని బాబుతో కలిసి గురువారం రాత్రి ఆనంద్ కుమార్ చేరుకున్నాడు. పోలీసులు కారుతో పాటు బాబు, ఆనంద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. తనకు కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు మొర పెట్టుకునేందుకు వచ్చినట్లు ఆనంద్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం.
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life. Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency