»Hyderabad Mayor Gadwal Vijayalakshmi Respons About Ram Gopal Varma Comments On Street Dogs Attack
Street Dogs Attack ఆర్జీవీ వ్యాఖ్యలతో బాధపడ్డా: మేయర్ విజయలక్ష్మి
జీహెచ్ఎంసీతో పాటు మరికొందరు ఇచ్చిన సహాయం కలిపి రూ.9,71,900 నష్ట పరిహారం చెక్కును బాలుడి తండ్రి గంగాధర్ కు అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని Hyderabad మేయర్ తెలిపారు.
కుక్కల దాడి (Street Dogs Attack)లో బాలుడి (Child Boy) మృతి సంఘటన అందరినీ కలచివేసింది. ఆడుకుంటున్న బాలుడిపై మూకుమ్మడి దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కాగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. జీహెచ్ఎంసీ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సమయంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహం తెప్పించాయి. ఈ అంశంపై దర్శకుడు (Director) రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించి అనుచిత వ్యాఖ్యలు (Sensational Comments) చేశాడు. ఆర్జీవీ (RGV) వ్యాఖ్యలపై తాను బాధపడినట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్జీవీ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ- Bharat Rashtra Samiti-BRS Party) ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day) నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో మహిళలపై ఎప్పుడూ చెడుగా మాట్లాడతారు. అయినా వెనక్కి తగ్గకుండా తలెత్తుకుని నిలబడాలి. మేయర్ గా నగరాన్ని నడపాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. బాలుడిని కరవాలని నేనే వీధి కుక్కలకు చెప్పినట్లు చాలా మంది మాట్లాడారు. కొంచెం బాధగా అనిపించినా.. అలాంటి ఆరోపణలను నవ్వుతూ అధిగమించాలి’ అని మేయర్ తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి (Gundu Sudharani) మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ తో పాటు అన్ని ధరలు పెంచుతూ సామాన్యుడిపై తీవ్ర భారం మోపుతోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సత్తా చాటుతున్న మహిళలను గుర్తించి వారిని సన్మానించారు.
అసలు ఆర్జీవీకి మేయర్ కు మధ్య వివాదం ఎక్కడ మొదలైందంటే.. కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సందర్భంగా మేయర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిలో ‘కుక్కలకు రెండు రోజులు ఆహారం లేక అలా దాడి చేశాయి’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి కేంద్రంగా మారాయి. ఈ వివాదంలోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రవేశించి మేయర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వరుసగా దాదాపు వారం పాటు మేయర్ పై తీవ్రమైన వ్యాఖ్యలతో విమర్శలు చేశాడు. వేల కుక్కలతో మేయర్ ను ఇంట్లో బంధించి ఉంచాలని ఆర్జీవీ కోరాడు. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వరుసగా ట్వీట్లు చేశాడు. కాగా వీధి కుక్క దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఉప మేయర్ మోతె శ్రీలతా రెడ్డి నష్ట పరిహారం అందించారు. జీహెచ్ఎంసీతో పాటు మరికొందరు ఇచ్చిన సహాయం కలిపి రూ.9,71,900 నష్ట పరిహారం చెక్కును బాలుడి తండ్రి గంగాధర్ కు అందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని Hyderabad మేయర్ తెలిపారు.