కర్ణాటకలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మేజిక్ ఫిగర్ టచ్ చేసింది. దీంతో బీజేపీ ప్లాన్-బి అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగారు. జేడీఎస్ నేతలకు బీజేపీ గాలం వేసే పనిలో పడినట్లు సమాచారం. కలిసి పని చేసేందుకు రావాలని పిలుపునిచ్చింది.