»Hot Winds Are Likely To Blow In 45 Mandals In Ap May 11th And 105 Mandals May 12th 2023
APలో నేడు 45, రేపు 105 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం
ఏపీ(ap)లో నేడు 45 మండలాల్లో, శుక్రవారం 104 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్(IMD) తెలిపింది. దీంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్(AP)లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ క్రమంలో పలు మండలాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈరోజు 45 మండలాల్లో, శుక్రవారం 104 మండలాల్లో వేడిగాలులు(Hot winds)వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని, ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
మే 11న అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఒక్కో మండలం, 11 జిల్లాల్లోని 45 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. 45 మండలాల్లో అనకాపల్లిలో 14, కాకినాడలో 9, అల్లూరి సీతారామరాజులో ఐదు, ఏలూరు, గుంటూరులో నాలుగు, తూర్పుగోదావరి, విజయనగరం, కోనసీమలో రెండు, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఇక మే 12న 13 జిల్లాల్లోని 104 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు.
మరోవైపు మే 10న (బుధవారం) ఐదు జిల్లాల్లోని తొమ్మిది మండలాల్లో హీట్‌వేవ్ పరిస్థితులు కనిపించాయి. గరిష్ట ఉష్ణోగ్రత 40 ° సెల్సియస్‌ను దాటింది. పల్నాడు జిల్లా జంగమహేశ్వరంలో అత్యధికంగా 40.5° సెల్సియస్, కడపలో 40.2° సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.