»Horoscope Today Todays Horoscope 2023 December 31st Beware Of Obstacles
Horoscope Today : నేటి రాశిఫలాలు(2023 December 31st)..ఆటంకాలుంటాయి జాగ్రత్త!
ఈ రోజు(December 31st 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
మేషం:
ఈ రాశివారు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండాలి. నిరుత్సాహం కలిగించే వార్తలు వింటారు. సంఘంలో అపకీర్తి కలుగుతుంది. ఇతరులకు అపకారం చేయాలని చూస్తారు. అనారోగ్య బాధలు ఉంటాయి. ఆదాయం పర్వాలేదు.
వృషభం:
ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో విరోధం ఏర్పడుతుంది. ఆదాయం తగ్గుతుంది.
మిథునం:
ఈ రాశివారికి అంతా మంచే జరుగుతుంది. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడుతుంది. ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బావుంటుంది. ఎవ్వరికీ హామీలు ఇవ్వకుండా చూసుకోవడం మంచిది.
కర్కాటకం:
ఈ రాశివారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబ కలహాలకు ఆస్కారం ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
సింహం:
ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగాలలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
కన్య:
ఈ రాశివారికి కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. సహనంగా ఉండటం మంచిది. మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తారు. ఆదాయం బావుంటుంది.
తుల:
ఈ రాశివారికి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వస్తాయి. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రుణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. బంధువుల సహకారాలు లభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.
వృశ్చికం:
ఈ రాశివారికి అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. సంఘంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పర్వాలేదు.
ధనుస్సు:
ఈ రాశివారు విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకున్న కార్యాలను పూర్తి చేస్తారు. శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి అనుకూల వాతావరణం ఉంటుంది.
మకరం:
ఈ రాశివారు కొత్త కార్యాలను మొదలెడతారు. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. కొత్త సమస్యల్లో చిక్కుకునేలా వ్యవహరిస్తారు. మిత్రులతో కలహాలు ఏర్పడతాయి.
కుంభం:
ఈ రాశివారికి అపకీర్తి కలుగుతుంది. సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేపట్టే కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం పర్వాలేదు.
మీనం:
ఈ రాశివారు చేపట్టిన పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో రుణ బాధలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆదాయం బావుంటుంది.