తెలంగాణ(Telangana)లో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain) పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ(Hyderabad Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్నాయని, దానివల్ల వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లో గురువారం వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ(Hyderabad Weather Department) తెలిపింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో శనివారం వరకూ అక్కడక్కడ భారీ వర్షాలు(Heavy Rain) పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ(Hyderabad Weather Department) ఎల్లో అలెర్ట్(Yellow Alert) జారీ చేసింది.