Niharika- Chaitanya: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న నిహారిక- చైతన్య
నటుడు నాగబాబు కూతురు నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విడిపోనుంది. మనస్పర్దల వల్ల గత కొన్ని రోజులుగా వీరు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరిపై బ్రేకప్ రూమర్స్ ఎక్కువయ్యాయి. అయితే విడాకులు కోరుతూ నిహారిక దరఖాస్తు చేసుకోవడంతో ఈ విషయంపై అందరికీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
మెగా కుటుంబంలో మరో జంట విడిపోయింది. నిహారిక-చైతన్య జంట విడాకులకు సిద్ధమైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం అయిన సంగతి తెలిసిందే. అయితే గత కొంత కాలంగా వీరిద్దరూ మనస్పర్దలతో దూరంగా ఉంటున్నారు. అయితే విడాకులు మాత్రం తీసుకోలేదు. తాజాగా ఈ జంట విడాకులు కోరుతూ హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం విడాకులు కోరుతూ నిహారిక తన పిటిషన్ దాఖలు చేసింది. దీంతో నిహారిక, చైతన్య విడిపోతున్నారనేది నిజం అయ్యింది.
నిహారిక- చైతన్యలు 2020 డిసెంబర్ 9వ తేదీన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరికి వివాహం అయ్యింది. కానీ రెండేళ్లకే వీరి పెళ్లి పెటాకులవ్వడంతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో గత కొన్ని రోజులుగా నిహారిక, చైతన్యలు వేర్వేరుగా ఉంటున్నారు. ఆ మధ్యన చైతన్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి నిహారికకు సంబంధించిన ఫొటోలన్నింటినీ డిలీట్ చేయడంతో వీరిద్దరి బ్రేకర్ రూమర్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం వీరు విడిపోతున్నారన్నది అఫిషియల్ అయ్యింది.