టాలీవుడ్(Tollywood) బ్యూటీ సమంత(samantha) మళ్లీ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా సమంత చేసిన ఇన్‌స్టా పోస్టు(Insta Post) చర్చనీయాంశమైంది. ఆ పోస్ట్‌లో సమంత ప్రేమ గురించి తెలిపింది. అక్కినేని నాగచైతన్య(Akkineni nagachaitanya)తో రెండేళ్ల కిందట విడాకులు తీసుకున్న సమంత ప్రస్తుతం తన దారి తాను చూసుకుంది. ఒంటరి జీవితం గడుపుతూ సినిమాలతో బిజీగా ఉంటోంది.
ఉన్నట్టుండి సమంత(samantha) ప్రేమ గురించి పోస్టు చేయడంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సమంత మళ్లీ ప్రేమ(Love)లో పడిందని కొందరు అంటుంటే, మరికొందరేమో వాటిని కొట్టిపారేస్తున్నారు.
సమంత(samantha) తన ఇన్ స్టా(Insta Post)లో ప్రఖ్యాత రచయిత అయిన పాబ్లో నెరూడా కొటేషన్ ను షేర్ చేసింది. “మనల్ని మరణం నుంచి ఏదీ రక్షించలేకపోతే, కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుంచి కాపాడాలి కదా!” అని ఆ పోస్టు సారాంశం. సమంత పోస్టు చేసిన ఆ కొటేషన్‌కు తోడుగా ఆమె ఓ షోటోను కూడా యాడ్ చేసింది. ఇద్దరు లవర్స్ కలిసి ఉన్న ఫోటోను సమంత షేర్ చేయడంతో అది కాస్తా వైరల్(Viral) అయ్యింది.