తేజస్వీ అంటేనే హాట్ కేక్ అని చెప్పొచ్చు. అమ్మడు చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోతునే ఉంటుంది. ఇక సినిమాల్లో అయితే చెప్పేదేలే అన్నట్టుగా బోల్డ్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అలాంటీ ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్న పాత్రలో నటించింది తేజస్వీ మదివాడ. ఈ సినిమా అమ్మడికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది. ఐస్ క్రీం,సుబ్రమణ్యం ఫర్ సేల్, కేరింత, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కమిట్మెంట్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సినిమాల్లో నటించింది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇంకొన్ని సినిమాల్లో హీరోయిన్‌గాను నటించింది. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ సినిమాలు అనుకున్నంత రేంజ్లో అమ్మడికి స్టార్ డమ్ ఇవ్వకపోయాయి.
కానీ బోల్డ్ బ్యూటీగా మరింత పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. కేవలం సినిమాలతోనే కాకుండా తన హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. బుల్లితెరపై కూడా సందడి చేస్తునే ఉంటుంది. ప్రముఖ రియాల్టీ షోలలో హాట్‌నెస్‌తో హీట్ ఎక్చకించింది. బిగ్ బాస్ హౌస్‌లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. బిబి జోడిలో అఖిల్‌తో రెచ్చిపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీఠలెక్కబోతున్నట్టు తెలుస్తోంది.
గతంలోను తేజస్వీ పెళ్లి వార్తలు చాలాసార్లు వినిపించాయి. కానీ ఇప్పటిలో ఇలాంటి ఆలోచన లేదని పుకార్లకుకు చెక్ పెట్టింది తేజస్వి. అయితే ఈసారి మాత్రం పెళ్లిపీఠలెక్కడం ఖాయమంటున్నారు. ఇప్పటికే సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందని, త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్పనుందని వినిపిస్తోంది. తేజస్వికి కాబోయే వాడు తన క్లోజ్ ఫ్రెండేనని అంటున్నారు. అయితే ఇలాంటి వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.