Prabhas: రాజు, రాముడు అయిపోయారు.. నెక్స్ట్ రాక్షసుడు, విష్ణువుగా ప్రభాస్!
ఇప్పటి వరకు రాజుగా, రాముడుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నెక్స్ట్ రాక్షసుడుగా ఊచకోతకు రెడీ అవుతున్నాడు. ఇక ఆ తర్వాత విష్ణువుగా కనిపింబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో కటౌట్ ఒక్కటే.. కానీ కంటెంట్ వేరే లెవల్ మావా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
బాహుబలి సినిమాలో.. రాజు అంటే ఇలా ఉండాలి కదా.. అని అనిపేంచేలా, పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్‌గా సెటిల్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పటి వరకు చూసిన రాజులు వేరు.. కానీ బాహుబలి తర్వాత రాజు ఒక్కడే అని ఫిక్స్ అయిపోయారు ఆడియెన్స్. ఇక రాజుగా దుమ్ములేపిన ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయాడు. శ్రీరాముడిగా ప్రభాస్ లుక్ అదరహో అనేలా ఉందని.. ఆదిపురుష్ చూసిన ఆడియెన్స్ మాట. ఇక రాముడిగా, రాజుగా రాజసం చూపించిన ప్రభాస్.. సలార్‌తో రాక్షసుడిగా మారబోతున్నాడు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అందులో ఒకటి నెగటివ్ క్యారెక్టర్ అని.. అది రాక్షసుడికి మించిన అవతారం అని ప్రచారంలో ఉంది. సెప్టెంబర్ 28న సలార్ ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. ఇక ఈ సినిమా తర్వాత పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ థియేటర్లోకి రానుంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె, సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ సినిమా సంక్రాంతి నుంచి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. ఇక 500 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో.. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు.
అయితే ప్రాజెక్ట్ కె.. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్లో ఫాంటసీని టచ్ ఇస్తూ.. ఇండియన్ మైథాలజీ గుర్తు చేసేలా ఉంటుందని ముందు నుంచి వినిపిస్తునే ఉంది. దాంతో మరోసారి.. అమితాబ్, ప్రభాస్, కమల్ సైంటిస్ట్‌లుగా.. ప్రభాస్ విష్ణువు అవతారంలో కనిపించనున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. విష్ణువు అవతారంలో ప్రభాస్ లుక్ అద్భుతంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ప్రాజక్ట్ కె పై అంచనాలు పెరిగిపోతున్నాయి. చూడాలి మరి.. విష్ణువుగా ప్రభాస్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.