»Happy Holi Do You Know The Significance Of Holi Today
హ్యాపీ హోలీ(Holi)..ఈరోజు ప్రాముఖ్యత మీకు తెలుసా!
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ(Holi) కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని ‘హొల్లిక’ అని పిలుస్తారు. పురాణాల ప్రకారం రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు(hiranyakashyap) తనను చంపేందుకు వేరేవాళ్లకు అసాధ్యమయ్యేలా వరం పొందుతాడు. ఆ క్రమంలో దేవుళ్లను ఆరాధించడం మానుకుని తనని మాత్రమే పూజించాలని ప్రజలను ఆదేశిస్తాడు. కానీ తన కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును ఆరాదిస్తాడు. దీంతో కొపానికి వచ్చిన హిరణ్యకశ్యపుడు పుత్రుడిని చంపేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తాడు. కానీ ప్రతి సారీ ప్రహ్లదుడు విష్ణువుని వేడుకోవడంతో రక్షించబడతాడు.
దీంతో ప్రహ్లదుడిని చంపేందుకు హిరణ్య మరో ప్లాన్ వేస్తాడు. హిరణ్యకశ్యపుడి సోదరి అయిన హోలిక(holika)కు మంటలను సైతం తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ క్రమంలో ఆమె ఓడిలో ప్రహ్లదుడిని కూర్చొబెట్టుకుని మంటల్లోకి వెళ్లాలని తండ్రి చెబుతాడు. ఆ క్రమంలో ఆమె మంటల నుంచి కాపాడే శాలువ ధరించడం వల్ల ఆమెకు ఏమి కాదు. ఇక తండ్రి ఆదేశాల మేరకు ప్రహ్లాదుడు(prahlad) ఆమెతోపాటు భోగి మంటల్లోకి వెళతాడు. ఆ క్రమంలో ప్రహ్లదుడు తనను రక్షించాలని విష్ణువును వేడుకుంటాడు. దీంతో ప్రహ్లాదుడికి ఏమి కాకుండా బయటకు వస్తాడు. కానీ మంటలు మొదలై పెరిగిన క్రమంలో విష్ణుమూర్తి మాయ కారణంగా రాక్షుస కుమార్తె అయిన హోలిక శాలువా ఎగిరిపోయి ఆమె సజీవ దహనమవుతుంది. దీంతో అప్పటి నుంచి హోలీకి ముందు రోజు హోలికా దహన్ జరుపుకుంటారు.
ఈ పండుగను దేశవ్యాప్తంగా(india) విభిన్న సంస్కృతుల వారు జరుపుకుంటారు. మార్చి 7, 8న 2023 తేదీల్లో ఈ ఏడాది జరుపుకుంటున్నారు. హోలీకి సంబంధించిన ఆచారంలో భాగంగా హోలీకి ముందు రోజు భోగి మంటలను వెలిగిస్తారు. ఇది ‘చెడుపై మంచి’ విజయాన్ని సాధించిన దానికి గుర్తుగా పాటిస్తున్నారు. ఫాల్గుణ మాసంలో పూర్ణిమ పౌర్ణమి రోజు సాయంత్రం పండుగ ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే మార్చి 8న హోలీని ప్రియమైన వారి మధ్య రంగులతో జరుపుకుంటారు. ప్రజలు దీనిని శీతాకాలపు రోజులకు ‘వీడ్కోలు’గా భావించడంతోపాటు వేసవికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో పలురకాల సాంప్రదాయ వంటకాలతో మిఠాయిలు(sweets) చేసుకుంటారు. మరికొన్ని రుచికరమైన పానీయాలు కూడా తయారు చేసుకుంటారు.
దేశవ్యాప్తంగా జరుపుకునే ఈ హోలీ పండుగకు మధుర(mathura)చాలా ప్రసిద్ధి చెందింది. కృష్ణ భగవానుడి జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతంలో 9 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు మధురను సందర్శిస్తారు. మరోవైపు బర్సానా(barsana)లో హోలీ ‘లాత్ మార్ హోలీ’ అనే పేరుతో జరుపుకుంటారు. ఇక్కడ స్త్రీలు పురుషులను కర్రలతో కొట్టగా.. పురుషులు కవచాలతో తమను తాము రక్షించుకునే సంప్రదాయం ఉంది. పశ్చిమ బెంగాల్(bengal)లో హోలీని ‘డోల్ జాత్రా’ గా పాటలు, సంప్రదాయ నృత్యాలతో నిర్వహించుకుంటారు.
దక్షిణ భారతం(south india)లో హోలీ నాడు ప్రేమ దేవుడైన కామదేవుడిని పూజిస్తారు. ఉత్తరాఖండ్(uttarakhand)లో కుమావోని హోలీని రాగాల గానంతో జరుపుకుంటారు. బీహార్(bihar)లో ప్రజలు తమ ఇళ్లను సంప్రదాయబద్ధంగా శుభ్రం చేసి పండుగకు హాజరవుతారు. పంజాబ్(punjab)లో విభిన్న శైలిలో దీనిని ‘హోలా మొహల్లా’ అని పిలుస్తారు. ఈ రోజున ప్రజలు తమ యుద్ధ కళలను, ముఖ్యంగా ‘కుష్టి’ని ప్రదర్శించి రంగులతో జరుపుకుంటారు.