వివాహ బంధంతో మంచు మనోజ్(Manchu Manoj), భూమా మౌనిక(Bhuma Mounika)లు ఒక్కటయ్యారు. పెళ్లి జరిగిన సందర్భంగా తన భార్య మౌనిక(Mounika)తో కలిసి మనోజ్ తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భూమా మౌనిక రాజకీయ ప్రవేశంపై మనోజ్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన మనోజ్(Manchu Manoj)కు ఓ ప్రశ్న ఎదురైంది. భూమా మౌనిక రాజకీయాల్లోకి రానున్నారా అనే ప్రశ్నకు మనోజ్(Manchu Manoj) సమాధానమిచ్చారు.

తనకు ప్రజా సేవ చేయాలని ఉందని, కానీ రాజకీయాల్లోకి మాత్రం తాను రానని, మౌనిక రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే తన మద్దతు ఉంటుందని తెలిపాడు. మౌనిక వైపు చూస్తూనే మనోజ్(Manchu Manoj) సమాధానమిచ్చాడు. తమ ఇద్దరినీ కలిపింది కూడా సేవ చేయాలనే ఆశయమే అని వివరించాడు. రానున్న రోజుల్లో తామిద్దరం ప్రజా సేవ చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు. దేవుడు ఆ శక్తిని తమ ఇద్దరికీ ఇవ్వాలని కోరుకున్నాడు.
మనోజ్(Manchu Manoj) మాటలను బట్టీ ఈ కొత్త జంట రాజకీయ ప్రవేశంపై ఓ క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం మంచు మనోజ్ మాటలపై చర్చ నడుస్తోంది. మనోజ్ రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశాన్ని పరోక్షంగా బయటపెట్టినట్లు ఈ సందర్భంగా తెలిసిందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు త్వరలో ఆళ్లగడ్డ లేదా నంద్యాలలో మౌనిక(Bhuma Mounika) తన కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తుందనే టాక్ వినిపిస్తోంది.