యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ బ్యూటీగా కొనసాగుతుంది. ఈ నటి కె రాఘవేందర్ రావు పెళ్లి సందడితో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ధమాకాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అన్నట్టు ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా తాను నటిస్తున్న చిత్రాల నుంచి మేకర్స్(makers) పోస్టర్లను రిలీజ్ చేస్తూ విషెస్ తెలియజేశారు.
యంగ్ ముద్దుగుమ్మ శ్రీలీల(Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్లో వర్ధమాన తారగా దూసుకెళ్తుంది. చేతి నిండా సినిమాలతో హైప్రొఫైల్ చిత్రాలను ఎంచుకుని మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో రాబోయే సంవత్సరాల్లో ఆమె నంబర్ వన్ నటిగా ఎదగడానికి సిద్ధంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈరోజు శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఆమె యాక్ట్ చేస్తున్న మేకర్స్ తమ తమ చిత్రాలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు.
మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి శ్రీలీల యాక్ట్ చేస్తున్న ఓ చిత్రాన్ని మేకర్స్(makers) రిలీజ్ చేశారు. ఆమె ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడు, పూజా హెగ్డే ప్రధాన కథానాయికగా, ఆమె రెండవ మహిళా కథానాయికగా ఎంపికైంది. కానీ సమీకరణాలు మారిపోయాయి. ఈ చిత్రంలో శ్రీలీలకి ఇప్పుడు సమానమైన స్క్రీన్ టైమ్ లభించినట్లు తెలుస్తోంది. పోస్టర్లో ఆమె సాంప్రదాయక హాఫ్ చీరలో సాధారణ తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపిస్తుంది. ఫోటోలో ఆమె తన కాలి వేళ్లకు నెయిల్ పాలిష్ పెయింట్ వేసుకుంటున్న ఫోజులో వావ్ అనిపిస్తుంది.
మరోవైపు రామ్, బోయపాటి శ్రీను సినిమా నిర్మాతలు ఆమె కొత్త పోస్టర్(new poster)ను విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. ఈ చిత్రంలో శ్రీలీల రామ్ సరసన యాక్ట్ చేయనుంది. ఇంకోవైపు నితిన్ 32వ చిత్రంలో కూడా ఈమె కథానాయికగా ఎంపికైంది. ఈ నేపత్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. దీంతోపాటు బాలయ్య ‘భగవంత్ కేసరి’లో నందమూరి బాలకృష్ణ కూతురిగా నటిస్తోంది. ఈ సందర్భంగా పోస్టర్లను విడుదల చేస్తూ ఆయా చిత్ర బృందాలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.