నేపాల్ లోని అన్నపూర్ణ పర్వతం లోయలో పడిపోయిన పర్వతారోహకుడిని ఎయిర్ లిఫ్ట్ చేశారు భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. ఇందుకుగాను పర్వతారోహకుడి కుటుంబం అదానీకి కృతజ్ఞతలు తెలిపింది. అనురాగ్ మాలూ అనే పర్వతారోహకుడు ఏప్రిల్ 17న నేపాల్ లోని అన్నపూర్ణ అనే పర్వతంపై నుంచి పడిపోయాడు. 5,800మీటర్ల ఎత్తు నుంచి పడిపోవడంతో కనిపించకుండా పోయాడు. ఇది ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం, ప్రమాదకరమైన భూభాగానికి ప్రసిద్ధి చెందింది.
విషయం తెలుసుకున్న గౌతమ్ అదానీ.. అనురాగ్ మాలూను ఖాట్మండు నుండి న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించడంలో సహాయం చేశారు. ఎయిర్ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయగా అనురాగ్ ను హాస్పిటల్ కు తరలించారు. సకాలంలో బాధితుడిని హాస్పిటల్ కు తరలించినందుకుగాను అతని సోదరుడు అశిష్ మూలూ అదానీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ట్వీట్ చేశారు. “సకాలంలో ఎయిర్‌లిఫ్టింగ్ చేసినందుకు చెప్పలేనన్ని కృతజ్ఞతలు! @AnuragMalooని సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో అమూల్యమైన సహకారం అందించిన @gautam_adani మరియు @AdaniFoundationకి హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆయన ట్వీట్ చేశారు.
రాజస్థాన్‌లోని కిషన్గఢ్లో నివసించే, అనురాగ్ మాలూ ఏప్రిల్ 17న అన్నపూర్ణ పర్వతంపై క్యాంప్ III నుండి దిగుతుండగా 5,800 మీటర్ల ఎత్తు నుండి పడిపోయి అదృశ్యమయ్యాడు – ఇది ప్రపంచంలోని 10వ ఎత్తైన పర్వతం, ఇది ప్రమాదకరమైన భూభాగానికి ప్రసిద్ధి చెందింది. అతన్ని ఏప్రిల్ 20న కనుగొన్నారు. మూడు రోజుల పాటు హిమపాతానికి గురయ్యే పగుళ్లలో ఉన్నందువలన… అతని పరిస్థితి విషమంగా మారింది. మొదట సమీపంలోని వైద్య శిబిరానికి, తరువాత పోఖారాలోని మణిపాల్ ఆసుపత్రికి ఆ తరువాత ఖాట్మండులోని మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.
నేపాల్ నుండి భారతదేశానికి ఎయిర్‌లిఫ్ట్, గ్రౌండ్ ట్రాన్స్‌ఫర్‌కు అయ్యే ఖర్చు తమ శక్తికి మించినదిగా అనిపించినందున దానికి అయ్యే ఖర్చును ఏర్పాటు చేసి భరించవలసిందిగా అతని కుటుంబం అదానీ ఫౌండేషన్ సహాయాన్ని అభ్యర్థించింది. ఇందుకుగాను… అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ గౌతమ్ అదానీ వెంటనే చర్యలు తీసుకున్నారు. అదానీ ఫౌండేషన్ ఎయిర్ అంబులెన్స్ ను ఏర్పాటు చేసి బాధితున్ని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు.
అనురాగ్ మాలూ కోలుకున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న అదానీ రీ ట్వీట్ చేశారు. అనురాగ్ కు సహాయం చేయడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ అభినందనలు తన భార్యకు దక్కుతాయని అన్నారు. అదానీ ఫౌండేషన్ ను తన భార్య ప్రీతి చూసుకుంటుందని తెలిపారు. “ప్రీతి మరియు నేను సహాయం చేయడాన్ని అదృష్టంగా బావిస్తున్నాము. అనురాగ్ క్షేమంగా ఉన్నారని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాము. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాము. అనురాగ్ త్వరలో మరిన్ని జీవిత శిఖరాలను జయించటానికి సిద్ధంగా ఉంటాడని మేము విశ్వసిస్తున్నాము” అని ట్వీట్ చేశారు.
ఖాట్మండు నుండి ఎయిర్‌లిఫ్ట్ చేసిన తర్వాత, అనురాగ్ ను AIIMS యొక్క జై ప్రకాష్ నారాయణ్ అపెక్స్ ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లారు, అక్కడ అతన్ని ICUలో చేర్చారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.