»Four Children Killed In Lightning Strike In Jharkhand
Mangos కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగుపాటు.. అక్కడికక్కడే నలుగురు
మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన నలుగురు చిన్నారులపై పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
ఝార్ఖండ్ (Jharkhand) లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మామిడి కాయల కోసం తోటకు వెళ్లిన చిన్నారులపై పిడుగు రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వర్షానికి చెట్టు కింద నిలబడిన నలుగురు చిన్నారులపై పిడుగు (Lightning Strike) పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటన సాహిబ్ గంజ్ జిల్లాలో (Sahibganj District) చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే… ఆదివారం దేశంలోని పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులతో రావడంతో పలు చోట్ల పిడుగులు కూడా పడ్డాయి.
ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాహ్ మహల్ ప్రాంతంలోని రాధానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మామిడి కాయలు కోయడానికి కొందరు పిల్లలు తోటకు వెళ్లారు. తీవ్రమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చిన్నారులు అక్కడే ఉన్న ఓ మామిడి చెట్టు కిందకు వెళ్లారు. అకస్మాత్తుగా పిడుగు పడటం వల్ల ఆ నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. మరో చిన్నారి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి నలుగురు మృతి చెందండంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.