HNK: జిల్లాలో లోన్ యాప్ వేధింపుల కారణంగా మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. వడ్డేపల్లి చర్చి సమీపంలోని బావిలో దూకి నవీన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నుంచి రుణం తీసుకున్న నవీన్‌ను అధిక వడ్డీ, నిరంతర బెదిరింపులు, అవమానకర సందేశాలతో రికవరీ ఏజెంట్లు వేధించారు. ఈ టార్చర్ భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.