వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని… తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తన సర్వే ఎప్పుడూ తప్పు కాదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పై ప్రజలకు పూర్తి నమ్మకంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా… ఈ క్రమంలో.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తమ పార్టీ కి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోతే.. తమ పార్టీకి 100 సీట్లు రావడం ఖాయం అంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.
25మంది తమ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని… వారికి సీటు ఇవ్వకుండా.. వారి స్థానంలో మరికొందరికి సీటు ఇస్తే… కచ్చితంగా 100 సీట్లు గ్యారెంటీ అని ఎర్రబెల్లి చెప్పారు. బీఆర్ఎస్కు 90 సీట్లు వచ్చే అవకాశముందని మంత్రి ఎర్రబెల్లి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే 100 సీట్లు గ్యారెంటీ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్ తో ఆ 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరనే చర్చ జోరుగా కొనసాగుతుంది.