Electricity employees: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో విద్యుత్ ఉద్యోగులు(Electricity Employees) 24 ఏళ్ల తర్వాత తొలిసారి సమ్మెకు సిద్ధమయ్యారు. జీతాలు పెంచాలంటూ అలాగే ఇంకో 12 డిమాండ్లతో గత రెడు రోజులుగా నిరసన(Agitations) చేపట్టారు. సర్కిల్, జోనల్, విద్యుదుత్పత్తి కేంద్రాలు, డిస్కమ్‌లు, జెన్కో, ట్రాన్స్‌కో ప్రధాన కార్యాలయాల్లోని ఉద్యోగుల నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసన ప్రదర్శనల్లో చేరాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా నిర్ణయించారు. ఉద్యమం ఉధృతం అవుతున్న వేల అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం స్పందించింది.
ఉద్యోగుల నిరసనలపై ప్రభుత్వం(AP Government) స్పందిస్తూ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు చర్చిద్దామని, గుణదల విద్యుత్ కార్యాలయంలోని ఏపీపీసీసీ ఛైర్మన్ చాంబర్‌కు పదిమంది నేతలు రావాలని తెలిపింది. ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యేంత వరకు నిరసన ప్రదర్శనలు కొనసాగించాలని ఏదైనా తేడాలొచ్చి ప్రభుత్వం మొండికేస్తే ఆగస్టు 10 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగులు నిర్ణయించారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 1999లో ఒక సారి వేతన సవరణ సహా ఇతర డిమాండ్ల కోసం విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగి వారి డిమాండ్లను సఫలం చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు నిరసనలు చేపట్టారు.