ప్రకాశం: యర్రగొండపాలెంలోని బెంగుళూరు బేకరీలో శనివారం ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవ్వడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో బేకరీలో మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆ వ్యక్తిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.