NLG: బీజేపీ, సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా ఆదివారం చిట్యాలలో దివ్యాంగులను ఆ పార్టీ నాయకులు సన్మానించారు. అక్టోబర్ 2 వరకు ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ పక్షోత్సవం నిర్వహించాలని పిలుపునిచ్చింది. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ సీనియర్ నాయకులు కన్నెబోయిన మహాలింగం, అశోక్, కందాటి చంద్రారెడ్డి పాల్గొన్నారు.