కోనసీమ: వైసీపీ అమలాపురం నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా రంగాపురంకి చెందిన మొసలి స్పర్జన్ రాజు నియమితులయ్యారు. వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందయని ఆయన ఆదివారం మీడియాకు తెలియజేశారు. పలువురు పార్టీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.