TG: సెల్ఫోన్లలో ఆన్లైన్ ఆటల నుంచి విద్యార్థుల దృష్టి మరల్చేందుకు ఓ కాలేజీ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో చదరంగం బోర్డు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఖాళీ సమయం దొరికితే చెస్ ఆడుతూ బుర్రకు పదును పెడుతున్నారు. ఒక్కో పావు కిలోకుపైగా ఉండటంతో శరీరానికి వ్యాయామం అవుతుందని మేనేజర్ బాపిరాజు తెలిపారు.