ATP: గుత్తి పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై బైక్పై అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ముగ్గురిని ఎక్సైజ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 60 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. బైక్ను సీజ్ చేశారు. 2,200 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఎక్సైజ్ సీఐ మోహన్ రెడ్డి కేసు నమోదు చేశారు.