»Delhi Freelance Journalist Claims Hypnotized And Duped 40000
Cyber Crime: ఫోన్ లో హిప్నటైజ్ చేశాడు..రూ.40వేలు గుంజాడు!
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫోన్ లో మాటలు కలిపిన ఓ వ్యక్తి హిప్నటైజ్(hipnotize) చేసి రూ.40వేలు కాజేసినట్లుగా పోలీసుల(police)కు ఫిర్యాదు అందింది. ఢిల్లీకి చెందిన ఓ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ తనను తాను బాధితుడిగా ప్రకటించకున్నాడు. అయితే ఇది హిప్నటైజ్ కాదని మామూలుగా సైబర్ నేరగాళ్ల(cyber crime) పనేనని పోలీసులు తెలిపారు. ఢిల్లీకి చెందిన రమేశ్ కుమార్ రాజా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఏప్రిల్ 25న తాను హిప్నటైజ్ కు గురై రూ.40వేలు పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
“ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. తన చిన్ననాటి స్నేహితుడినని నమ్మించాడు. అతడి మాటలు విన్నాక నేను నిజమేనని అనుకున్నాను. అతని మాటల మాయలో నేను ఆలోచనా శక్తిని కోల్పోయాను. అలా కొన్నిరోజులు గడిచాక నన్ను మాటల్లో ఉంచి పేటీఎం(paytm) ద్వారా నా బ్యాంక్ ఖాతా నుంచి రూ.20 వేల చొప్పున రెండు సార్లు ధనాన్ని కొట్టేశాడు” అని రమేష్ రాజా పోలీసులకు తెలిపారు.
హిప్నటైజేషన్(hipnotize) లో 30 సంవత్సరాల అనుభవం ఉన్నవారు చెప్పిన విషయం ప్రకారం… ఫోన్ లో హిప్నటైజ్ చేయడం కుదరదని తేల్చారు. అయితే బాధితుడు సదరు నిందితుడి మాయమాటల్లో పడి అదే హిప్నటైజ్ అని భ్రమపడుతున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.