»Delhi Man Walked 40 Km In Search Of Children To Rape And Murder
Delhi : అర్థరాత్రుల్లో పిల్లలే టార్గెట్… కిడ్నాప్ చేసి దారుణం..!
ఏడేళ్లుగా ఢిల్లీలో 30 మంది చిన్నారులను రవీంద్రకుమార్ హత్య చేశాడు. అతను మాదకద్రవ్యాలకు ఎక్కువగా అలవాటు పడ్డాడు, అశ్లీల చిత్రాలు చూడటం మరియు లైంగిక వేధింపుల కోసం పిల్లలను వెతుకుతూ, ఆపై వారిని చంపేవాడు.
ఏడేళ్లుగా 30మంది చిన్నారులను లైంగికంగా వేధించి చంపేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో కూలీ పనిచేస్తున్న రవీంద్రకుమార్ అనే వ్యక్తి డ్రగ్స్ తాగి, అశ్లీల చిత్రాలను చూసి, పిల్లలను వెతుక్కుంటూ లైంగిక వేధింపులకు పాల్పడి, చంపేస్తుంటాడని పోలీసులు తెలిపారు. 2008 నుంచి ఇప్పటివరకు 30మంది చిన్నారులను చంపినట్లు చెప్పారు. ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి. శారీరకంగా వేధించి హత్య చేసిన కేసులో ఈ రోజు అతన్ని కోర్టు దోషిగా తేల్చింది. 2015లో ఔటర్ ఢిల్లీ ప్రాంతంలో నిందితుడు రవీంద్రకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు గరిష్టంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరో రెండు వారాల్లో రవీంద్రకు కోర్టు శిక్ష విధించనుంది.
2008లో 18 ఏళ్ల రవీంద్ర కుమార్ ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ నుంచి పని వెతుక్కుంటూ ఢిల్లీకి వచ్చాడు. అతని తండ్రి ప్లంబర్‌గా పని చేయగా, అతని తల్లి ఇళ్లలో పని చేసేది. ఢిల్లీకి వచ్చిన కొద్ది రోజులకే డ్రగ్స్‌కు బానిసైన రవీంద్ర.. వీడియో క్యాసెట్లో అశ్లీల చిత్రాలు చూసేవాడని ఆతర్వాత పిల్లలపై దాడులు చేయడం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. రవీంద్రకుమార్ రోజంతా కూలి పని చేసి సాయంత్రం పూట మద్యం మత్తులో ఉండేవాడు. అతను పిల్లలను వెతకడానికి ముందు రాత్రి ఒక మురికివాడలో నిద్రించేవాడని చెప్పారు. కొన్నిసార్లు పిల్లలను వెతుక్కుంటూ మురికివాడల చుట్టూ 40 కిలోమీటర్ల వరకు నడిచేవాడని తెలిపారు. 10 రూపాయల నోట్లు, చాక్లెట్లతో పిల్లలను రప్పించి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లేవాడని చెప్పారు. అతని వలన బలైన పిన్న వయస్కుడికి 6 ఏళ్లు, పెద్దవాడికి 12 ఏళ్లుగా పోలీసులు గుర్తించారు.
రెండుసార్లు పట్టుబడ్డాడు..
రవీంద్ర కుమార్ 2014లో మొదటిసారి పోలీసులకు పట్టుబడ్డాడు. 6 ఏళ్ల చిన్నారిని కిడ్నాప్, హత్యాయత్నం, శారీరకంగా వేధింపులకు గురి చేయడం వంటి ఆరోపణలతో పోలీసులకు అరెస్ట్ చేశారు.
చిన్నారిని కిడ్నాప్ చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని తర్వాత, 2015లో 6 ఏళ్ల బాలిక కేసును విచారిస్తున్న పోలీసులు, ఢిల్లీలోని రోహిణిలోని సుఖ్బీర్ నగర్ బస్టాండ్ దగ్గర నుంచి అతడిని అరెస్ట్ చేశారు. రవీంద్రను పట్టుకునే ముందు, పోలీసులు డజన్ల కొద్దీ CCTV కెమెరాల నుండి ఫుటేజీని తనిఖీ చేసారు, వారి ఇన్ఫార్మర్లను విచారించారు, చివరకు రవీంద్రను అరెస్టు చేశారు. బాలికను కిడ్నాప్ చేసి, శారీరకంగా హింసించి, గొంతు కోసి, సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లుగా పోలీసులు తెలిపారు.