Manish Sisodia: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్
మద్యం లిక్కర్ కేసు(Liquior Case)లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేసి ప్రత్యేక కార్యాలయానికి తరలించారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన్ని సీబీఐ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు. మనీశ్ సిసోడియా(Manish sisodia) మీడియాతో మాట్లాడుతూ..తనను సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేస్తారని తెలిపారు. అందుకే ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను కూడా మళ్లించారన్నారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఫిబ్రవరి 19వ తేది మనీశ్ సిసోడియా(Manish sisodia)ను సీబీఐ అధికారులు హాజరు కావాలని కోరారు. అయితే తాను ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్నందున వచ్చే ఆర్థిక ఏడాది బడ్జెట్ రూపకల్పనలో బిజీగా ఉన్నానని, తనకు సమయం కావాలని సీబీఐ(CBI)ను మనీశ్ సిసోడియా కోరారు. దీనికి సీబీఐ అధికారులు కూడా అంగీకరించారు.
ఆదివారం మనీశ్ సిసోడియా(Manish Sisodia)ను 8 గంటల పాటు విచారించిన అనంతరం అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. అయితే ఆ లిస్ట్ లో మనీశ్ సిసోడియా పేరు లేకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోాలున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ(CBI) అధికారులు అరెస్ట్ చేశారు.