ప్రతినెలా కొన్ని నిబంధనలు(Rules) మారుతుండటం గత కొన్ని నెలలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్(Banking), గ్యాస్ సిలిండర్, ఇన్కమ్ ట్యాక్స్(Income tax), ఈపీఎఫ్ఓ(EPFO) వంటి వాటిలో నిబంధనలు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. మార్చి నెల రాబోతున్న నేపథ్యంలో వినియోగదారుల(Users)పై కొన్ని అదనపు భారాలు పడే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెల(March Month)లో మారే నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతినెలా కొన్ని నిబంధనలు(Rules) మారుతుండటం గత కొన్ని నెలలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్(Banking), గ్యాస్ సిలిండర్, ఇన్కమ్ ట్యాక్స్(Income tax), ఈపీఎఫ్ఓ(EPFO) వంటి వాటిలో నిబంధనలు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. ఇంకో రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల ముగియనుంది. మార్చి నెల రాబోతున్న నేపథ్యంలో వినియోగదారుల(Users)పై కొన్ని అదనపు భారాలు పడే అవకాశం కనిపిస్తోంది. మార్చి నెల(March Month)లో మారే నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి నెల(March Month)లో బ్యాంకు రుణా(Banks Loans)లలో మార్పు అనేది జరుగుతోంది. ఆర్బీఐ(RBI) ఇటీవలె రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. వివిధ రుణాలపై కూడా వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మార్చి 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకు రుణాలు(Banks Loans) అనేవి ఇకపై సామాన్య ప్రజలకు మరింత భారం కానున్నాయి.
ఇకపోతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు(SBI Credit Card)కు సంబంధించి ఓ కొత్త నిబంధన మార్చి 17 నుంచి అమలు కానుంది. క్రెడిట్ కార్డు(Credit Card) విభాగం ఈమధ్యనే ఎస్బీఐ కార్డు కొత్త ఛార్జీలను వెల్లడించింది. పెంచిన ఛార్జీలు 17వ తేది నుంచి అమల్లోకి రానుండగా ఇకపై ఎవరైనా క్రెడిట్ కార్డు(Credit Card) ద్వారా అద్దె చెల్లిస్తే రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ట్యాక్స్(Tax) కూడా ఉంటుంది. గతంలో ఇదే ఛార్జీ రూ.99 ఉండేది. ఇప్పుడు ఈ ఛార్జీ డబుల్ అవ్వడంతో వినియోగదారుల(Users) జేబులకు చిల్లులు పడనుంది.
సుప్రీం ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్(EPF) కస్టమర్లకు అధిక పెన్షన్ ఆప్షన్ అవకాశం తీసుకొచ్చింది. దీనికి ఖాతాదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మార్చి 3వ తేదే చివరి గడువుగా ఈపీఎఫ్ఓ(EPFO) వెల్లడించింది. ఇకపోతే సామాజిక మాధ్యమాలపై ఫిర్యాదులు అందించాలంటే మూడు అప్పీలేట్ కమిటీలు ఏర్పాటు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కమిటీలు మార్చి 1 నుంచి తమ పనులు మొదలు పెడతాయి. ఇవి ఫిర్యాదులను 30 రోజుల్లోనే పరిష్కరిస్తాయి.