»Akshay Kumar React On His Consecutive Flops Do Not Blame Audience
Akshay Kumar: వరుస చిత్రాల ఫ్లాపులపై అక్షయ్ రియాక్ట్
తన బ్యాక్ టు బ్యాక్ సినిమాల ప్లాపుల గురించి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. అందుకు 100 శాతం పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశాడు. ప్లాపులు తనకు కొత్త ఏం కాదని పేర్కొన్నాడు. ఒక దశలో వరుసగా 8, 16 చిత్రాలు హిట్టు కాలేదని గుర్తు చేశారు.
బాలీవుడ్(bollywood)లో వరుస ప్లాప్ చిత్రాలతో ఇబ్బంది పడుతున్న హీరో అక్షయ్ కుమార్(akshay kumar). ఇటీవల విడుదలైన మూడు నాలుగు చిత్రాల్లో ఒక్కటి కూడా హిట్టు(hit) కాలేదు. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్(box office) వద్ద తన సినిమాల పరాజయానికి తానే బాధ్యత వహిస్తానని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇది తనకు కొత్త కాదని, గతంలో ఒకనొక సమయంలో వరుసగా 16 చిత్రాలు, మరొక దశలో 8 సినిమాలు(movies) ప్లాప్ అయినట్లు గుర్తు చేశారు. ప్రేక్షకులు మారారని, దాంతోపాటు మేము కూడా మీరు మారాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారని తెలిపారు.
సినిమాలు హిట్ కానపుడు అది ప్రేక్షకుల తప్పు కాదన్నారు. మరోవైపు ఇతరులను కూడా నిందించవద్దన్నారు. ఇది 100 శాతం తనదే తప్పని అన్నారు. తాను ఎంచుకున్న స్టోరీ(story) కారణంగా లేదా సినిమాలో సరైన కొత్తదనం లేకపోవడం కూడా అయి ఉండవచ్చని వెల్లడించారు. ఇటీవల అక్షయ్ కుమార్(akshay kumar) నటించిన సెల్ఫీ(selfi) చిత్రం ప్లాప్ టాక్ వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇది ఒక్క సినిమా రంగంలోనే లేదని పేర్కొన్నారు. వ్యాపారం కావచ్చు. క్రెకెట్(cricket) కావచ్చు ఎవరికైనా చేదు అనుభవాలు ఉంటాయని తెలిపారు.
మహమ్మారి కరోనా లాక్డౌన్(lockdown) తర్వాత బాక్సాఫీస్(box office) వద్ద అక్షయ్ కుమార్(akshay kumar) బెల్ బాటమ్ థియేటర్లలో విడుదలైన మొదటి చిత్రం హిట్టుగా నిలిచింది. ఇక ఆ తర్వాత 2022లో వచ్చిన చిత్రాలన్నీ హిట్టు కావడంలో విఫలమయ్యాయి. గతేడాది రక్షా బంధన్, రామ్ సేతు(ram setu), సామ్రాట్ పృథ్వీరాజ్, బచ్చన్ పాండే మొదలైన సినిమాలు తెరపై ఫ్లాప్‌గా నిలిచాయి. ఇక సెల్ఫీ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలైంది. ఈ చిత్రం మొదటి రోజు ₹3 కోట్ల కంటే తక్కువ ఓపెనింగ్ కలెక్షన్‌ను సాధించి నిరాశపరిచింది.
ఈ చిత్రం మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్(driving licence)కి హిందీ రీమేక్. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన మలయాళం చిత్రంలో నటులు పృథ్వీరాజ్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలలో నటించారు. సినిమా కథాంశం అక్షయ్ కుమార్, సినీ నటుడి పాత్రను పోషిస్తూ, తన సినిమాల్లో ఒక స్టంట్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్(driving licence)పొందాలని కోరుకున్నాడు. అతను కలిసిన RTO అధికారి, అతనికి వీరాభిమానిగా మారిపోతాడు. ప్రధానంగా అక్షయ్ కుమార్ ఫ్లాప్(flops) సినిమాల పరంపరను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని భావించారు. కానీ అది జరుగలేదు. దీంతోపాటు ఇమ్రాన్ హష్మీ(emraan hashmi), నుష్రత్ బరుచ్చా, డయానా వంటి నటులు యాక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంతో విఫలమైంది.