»Ss Rajamouli Selfie With 11 Year Old Child American Actress Mcgraw
SS Rajamouli:11 ఏళ్ల బాల నటి మెక్గ్రాతో రాజమౌళి సెల్ఫీ..వైరల్
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా ఫేమస్ దర్శకుడు రాజమౌళి(SS Rajamouli) ఓ అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) ఫోటోలకు ఫోజులిచ్చారు. 11 ఏళ్ల అద్భుతమైన నటి మెక్‌గ్రా తనకు అవార్డు అందించడం పట్లు జక్కన్న సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన ఇన్ స్టా వేదికగా ఆ చిత్రాన్ని పంచుకున్నారు.
ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి(SS Rajamouli) అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw)తో సెల్ఫీ(selfie) దిగారు. ఈ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో వైరల్(viral) అవుతోంది. ఈ బాలనటి చివరిసారిగా 2022లో హారర్ చిత్రం M3GANలో కేడీగా కనిపించింది. ఆమె ది హాంటింగ్ ఆఫ్ హిల్ హౌస్‌లో కూడా భాగంగా ఉంది.
హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్(HCA) వేడుకల్లో భాగంగా RRR మూవీ పలు అవార్డులను గెలుచుకుంది. ఆ క్రమంలో ప్రముఖ చిత్రనిర్మాత SS రాజమౌళి(Rajamouli) ఈ వేడుకకు హాజరయ్యారు. 11 ఏళ్ల అమెరికన్ బాలనటి వైలెట్ మెక్‌గ్రా(Violet McGraw) చేతుల మీదుగా రాజమౌళి అవార్డును స్వీకరించారు. ఆ నేపథ్యంలో తనకు అవార్డును అందించిన వైలెట్‌తో రాజమౌళి(Rajamouli) సెల్ఫీ పోటోలకు ఫోజులిచ్చారు. ఈ మేరకు జక్కన్న ఈ విషయాన్ని తన ఇన్ స్టా(Instagram) ద్వారా వెల్లడించారు. అద్భుతమైన ప్రతిభావంతులైన 11 ఏళ్ల @violetmcgraw వేదికపై తనకు అవార్డును అందించినప్పుడు తాను చాలా సంతోషించానని తెలిపారు. తర్వాత ఆమె నన్ను సెల్ఫీ కోసం అడిగినప్పుడు మరింత సంతోషించానని రాజమౌళి ఆనందం వ్యక్తం చేస్తూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జక్కన్న ఇండియాకే(india) గర్వకారణమని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.
శనివారం SS రాజమౌళి RRR ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంతో పాటు 3 పెద్ద అవార్డులను గెలుచుకుంది. వాటిలో ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఆస్కార్-నామినేట్ అయిన నాటు నాటు కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఉన్నాయి. RRRలో అత్యుత్తమ విన్యాసాలు ఉన్నాయని భావించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) సభ్యులందరికీ రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. ఈ మూవీలో భాగంగా అన్ని విన్యాసాలు చేయడానికి చాలా కృషి చేసిన నా కొరియోగ్రాఫర్‌కి నేను మొదట ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. మరోవైపు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లలో జుజీ [స్టంట్ మాస్టర్] చాలా సహాయం చేశారని గుర్తు చేశారు. నిజంగా మా విజన్‌ని అర్థం చేసుకున్న ఇతర కొరియోగ్రాఫర్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు వెల్లడించారు. మా వర్కింగ్ స్టైల్‌కు అనుగుణంగా తమ వర్కింగ్ స్టైల్(working style)ని మార్చుకున్నారని జక్కన్న గుర్తు చేశారు.
మరోవైపు తన “అద్భుతమైన నటులు” జూనియర్ ఎన్టీఆర్(ntr), రామ్ చరణ్(ram charan)లు మెజారిటీ స్టంట్స్ చేశారని రాజమౌళి వెల్లడించారు. “మొత్తం సినిమాలోని అనేక యాక్షన్ షాట్(action scenes)లలో, మేము బాడీ డబుల్స్ ఉపయోగించి 2-3 షాట్లు చాలా తక్కువ అని గుర్తు చేశారు. నటీనటులు ఒక్కో స్టంట్‌ను ప్రదర్శించారు. వారు అద్భుతమైన హీరోలని ప్రశంసించారు. ఇది టీమ్ మొత్తం కలిసి చేసిన కృషి అన్నారు. ఇందుకు నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. 320 రోజులు కష్టపడి ఈ సినిమా తీశాం. చాలా వరకు స్టంట్స్‌తో తీశాం. ఈ గుర్తింపు నాకు, నా చిత్రానికి మాత్రమే కాదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కూడా చాలా ప్రధానమైనదని వెల్లడించారు. ఈ క్రమంలో తాము మరింత అద్భుతంగా మరిన్ని చిత్రాలు తీసేందుకు తమకు బాధ్యత పెరగిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక RRR టీమ్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుకపై దృష్టి సారిస్తోంది. ఈ వేడుక మార్చి 13న జరుగనుంది.