»Terrible Trolls On The Heroine The Actress Is In Tears
Ritika singh: హీరోయిన్‌పై దారుణంగా ట్రోల్స్..కన్నీళ్లు పెట్టుకున్న నటి
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్(Trolls) ఎక్కువవుతున్నాయి. తమపై ట్రోల్స్(Trolles) చేయడం గురించి చాలా మంది నటీమణులు పలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. సెలబ్రిటీ(Celebrities)లంతా తమపై వస్తున్న నెగిటివిటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా హీరోయిన్ రితిక సింగ్(Ritika singh) కూడా తనపై వస్తున్న ట్రోల్స్(Trolles)కు సంబంధించి రియాక్ట్ అయ్యింది.
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్(Trolls) ఎక్కువవుతున్నాయి. అందులోనూ సినీ హీరోలు, హీరోయిన్లపై సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తమపై ట్రోల్స్(Trolles) చేయడం గురించి చాలా మంది నటీమణులు పలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. సెలబ్రిటీ(Celebrities)లంతా తమపై వస్తున్న నెగిటివిటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇంకొందరైతే చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. తాజాగా హీరోయిన్ రితిక సింగ్(Ritika singh) కూడా తనపై వస్తున్న ట్రోల్స్(Trolles)కు సంబంధించి రియాక్ట్ అయ్యింది.
తనకు సోషల్ మీడియా వేదికగా ఎన్నో అనుభవాలు ఎదురైనట్లు తెలిపింది. 2017లో రితిక సింగ్(Ritika singh) విక్టరీ వెంకటేష్(Victory venkatesh) సరసన ”గురు” సినిమాతో తెలుగు స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘నీవెవరో’, ‘శివలింగ’ వంటి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం రితిక సింగ్(Ritika singh) ”కార్” అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈమధ్యనే జరిగింది. ఆ ఈవెంట్లో పాల్గొన్న రితిక సింగ్(Ritika singh) తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్(Trolls)పై స్పందించింది.
నెట్టింట తనపై వస్తున్న ట్రోల్స్(Trolles)కు తాను చాలా బాధపడినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్, ట్రోల్స్ సెలబ్రిటీలను ఎంతగానో బాధపెడతాయని, తాను కూడా బాధపడినట్లు తెలిపింది. తనకు ఓ ఫ్యామిలీ ఉందని, తన పేరెంట్స్, బ్రదర్ కూడా ఆ మీమ్స్, ట్రోల్స్ చూస్తే గుండె బద్దలవుతుందని, ఆడవారికి కనీసం గౌరవం ఇవ్వాలని రితిక సింగ్(Ritika singh) రియాక్ట్ అయ్యింది.
ఒక సెలబ్రిటీ అయినా మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా వారిని కచ్చితంగా గౌరవించి తీరాలని రితిక సింగ్(Ritika singh) కోరింది. అలాగే అమ్మాయిలంతా కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్సివ్ గా ఉండాలని కోరింది. కాలేజీల్లో, స్కూల్లో కనీసం ఒక్కసారైనా సెల్ఫ్ డిఫెన్సివ్ కు సంబంధించిన క్లాసులు జరగాలని, ఆ విషయంలో తాను ఎలాంటి సాయం చేయడానికైనా ముందుంటానని వెల్లడించింది. రితిక సింగ్(Ritika singh) నటిస్తున్న ”కార్” అనే మూవీ మే 4వ తేది థియేటర్లలో విడుదల కానుంది.