WNP: రాయిగడ్డకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి రాగివేణు సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్‌కు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వేణు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణంతో పార్టీకి తీరని లోటని దేవన్న సంతాపం తెలిపారు.