»Csir Made A Lotus With 108 Petals What Is Special
Namoh108: కమలం తయారు చేసిన CSIR..స్పెషల్ ఏంటంటే
ప్రధాని మోడీ(modi) పేరు మీద CSIR-NBRI పరిశోధన చేసి సరికొత్త కమలం(lotus) పువ్వను రూపొందించారు. అంతేకాదు దానికి నమోహ్ 108(Namoh 108) అనే పేరు పెట్టి ఇది ఏకంగా 10 నెలల పాటు వికసిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరి దీని ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చుద్దాం.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) ల్యాబొరేటరీ శనివారం 108 రేకులతో కూడిన కొత్త రకం కమలాన్ని ఆవిష్కరించింది. అంతేకాదు దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీదుగా నమోహ్ 108(Namoh 108) అని పేరు పెట్టారు. ఇతర సంస్థలలోని వృక్షశాస్త్రజ్ఞులు కూడా దీనిపై కీలకమైన ప్రశ్నలను లేవనెత్తారు. నమోహ్ 108 అనేది నరేంద్ర మోడీకి ఇస్తున్న ఒక గొప్ప బహుమతి అంటు పేర్కొన్నారు. అయితే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI)చే అభివృద్ధి చేయబడిన కమలం మార్చి నుంచి డిసెంబర్ వరకు వికసిస్తుంది. పోషకాలతో సమృద్ధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది మొదటి తామర రకం, దీని జన్యువు దాని లక్షణాలు పూర్తిగా క్రమబద్ధీకరించబడ్డాయని వెల్లడించారు.
భారతీయ సంస్కృతిలో కమలం పట్ల ఉన్న గౌరవంతో పాటు మతపరమైన ప్రాముఖ్యత కారణంగా ‘108’ సంఖ్యను ఎంపిక చేశారు. ముఖ్యంగా ఈ తామర రకం ప్రారంభం మణిపూర్లో ఉంది. NBRI నుంచి శాస్త్రవేత్తలు పరిశోధన ప్రయోజనాల కోసం ఈశాన్య రాష్ట్రం నుంచి ఈ రకాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత దీనిని పూర్తిగా క్రమబద్ధీకరించబడిన జన్యువుతో మొదటి తామర రకంగా రూపొందించి తయారు చేశారు. ఈ క్రమంలో ఇతర పువ్వులు(flowers), అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలను కూడా రక్షించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రధాన పరిశోధకుడు డాక్టర్ KJ సింగ్ ప్రకారం ఇతర తామర రకాలతో పోల్చితే ‘నమోహ్ 108’ రకం వాతావరణ స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుంది. ఇది అసాధారణమైన పుష్పించే వ్యవధిని కలిగి ఉంది. అంటే దాదాపు 10 నెలలు. ఇక సాధారణ పుష్పాలు అయితే 4 నుంచి 5 నెలలు మాత్రమే పుష్పిస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘నమోహ్ 108’ లోటస్ పెద్ద లేత గులాబీ రేకులను కలిగి ఉంటుందని, పువ్వులు 10 అంగుళాల వరకు వ్యాసం కలిగి ఉంటాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు CSIR-NBRI చేసిన ఈ వినూత్న ప్రయత్నం భారతదేశం సాంస్కృతిక, వృక్షశాస్త్ర వారసత్వాన్ని సంరక్షించడానికి దోహదపడుతుందని అన్నారు.