ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు(Nandi Awards) వేడుక ప్రతి ఏటా వైభవంగా జరుగుతూ ఉండేది. సినిమా ఇండస్ట్రీలోని 24 రంగాల్లో ప్రతిభ చూపిన వారికి నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి సత్కరించేది. అయితే రాష్ట్రం విడిపోయాక మాత్రం నంది అవార్డులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. రెండు రాష్ట్రాలూ నంది అవార్డు(Nandi Awards)లను ఇవ్వడం మానేయడంతో ప్రముఖ నిర్మాతలు అశ్వినిదత్, ఆదిశేషగిరి రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఇప్పుడుండే పరిస్థితులు చూస్తుంటే నంది అవార్డులు(Nandi Awards) కాకుండా ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారని వ్యాఖ్యలు చేశారు. అటువంటి అవార్డులను సినిమాలకు ఇచ్చే రోజులు కూడా మరో రెండు, మూడేళ్లలో రాబోతున్నాయని అశ్వినిదత్ తెలిపారు. ఈ విషయంలో అశ్వినిదత్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ(Posani Krishna murali) ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అని కాదు మీరు ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమలోఫర్, ఉత్తమ మోసగాడు అవార్డులు మీ వాళ్లకే ఇవ్వాలంటూ పోసాని ఘాటుగా విమర్శించారు. సీఎం జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారంటూ వాపోయారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేల్లు అవుతోందని, రెండేల్లు కరోనా వస్తే దాని నుంచి ప్రజల్ని కాపాడారని, ఆ తర్వాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికి ఇస్తూ పోతున్నారని పోసాని స్పష్టం చేశారు. ప్రస్తుతం పోసాని(Posani Krishna murali) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.