»Cm Jagan Said Good News 1 42 Crore New Arogyashri Cards Have Been Issued
CM Jagan: గుడ్న్యూస్ చెప్పిన సీఎం జగన్..1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈ నెలలో కొత్తగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రెండో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) ప్రజలకు గుడ్న్యూస్ చెప్పారు. ఆరోగ్య శ్రీ పథకం (Arogya sri Scheme)లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ తరుణంలో డిసెంబర్ 18వ తేది నుంచి కొత్తగా జారీ అయిన ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ (New Arogyasri cards Issue) చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.42 కోట్ల కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం జగన్ (CM Jagan) అధ్యక్షతన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆరోగ్య శ్రీ కార్డులకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ..ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గుర్తించిన రోగుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాగే ఆ రోగులకు సకాలంలో మందులను అందించాలని, ఎక్కడా కూడా మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఎక్కాడా రాజీపడొద్దన్నారు. జనవరి 1వ తేది నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష (Arogya Suraksha) రెండో దశను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ మండలంలో ఆరోగ్య సురక్ష క్యాంపును నిర్వహించనున్నట్లు తెలిపారు. 2023 నవంబర్ నెలాఖరు వరకూ 12.42 లక్షల మంది ఉచితంగా ఆరోగ్య శ్రీ కింద చికిత్స తీసుకున్నారని, గత ఏడాది కంటే ఈసారి 24.64 శాతం అధికంగా ఈ చికిత్సను అందించినట్లు వెల్లడించారు.